ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న కాం ట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై పో రాటం చేస్తామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ స్వా మిగౌడ్ తెలిపారు.
మహబూబ్‌నగర్ వైద్యవిభాగం, న్యూస్‌లైన్: ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న కాం ట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై పో రాటం చేస్తామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ స్వా మిగౌడ్ తెలిపారు. తమ సమస్యలను పరి ష్కరించాలిని కోరుతూ ఆరోగ్యశ్రీ ఉద్యోగులు ఆదివారం ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌ను హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కలి సి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగులకు న్యాయం చేస్తామని వారికి ఇచ్చారు. ఉద్యోగ భద్రత కల్పించేందుకు కృషి చేస్తామని, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ చేస్తామని ఇప్పటికే చెప్పినట్లు గుర్తుచేశారు. స్వామిగౌడ్‌ను కలిసినవారిలో సంఘం జిల్లా అధ్యక్షుడు విష్ణు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, కోశాధికారి శ్రీనివాస్, విజయ్‌భాస్కర్, శ్రీనివాస్‌శెట్టి, యాదయ్య, వరప్రసాద్ తదితరులు ఉన్నారు.