విద్యుదాఘాతం మృతులకు కన్నీటి వీడ్కోలు | Electric shock tearful farewell to the dead | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతం మృతులకు కన్నీటి వీడ్కోలు

Jul 2 2015 12:54 AM | Updated on Sep 5 2018 2:25 PM

విద్యుదాఘాతం మృతులకు కన్నీటి వీడ్కోలు - Sakshi

విద్యుదాఘాతం మృతులకు కన్నీటి వీడ్కోలు

స్థానిక ఊర్మిళానగర్‌లో మంగళవారం విద్యుదాఘాతంతో మృతి చెందిన ఐదుగురి అంతిమ యాత్ర బుధవారం జరిగింది.

భవానీపురం : స్థానిక ఊర్మిళానగర్‌లో మంగళవారం విద్యుదాఘాతంతో మృతి చెందిన ఐదుగురి అంతిమ యాత్ర బుధవారం జరిగింది. ఈ యాత్రలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఐరన్ పైప్‌లను కింద నుంచి పైఅంతస్తుకు తీసుకువెళుతుండగా అవి 11 కేవీ విద్యుత్ వైర్లకు తగిలి కరెంట్ షాక్‌కు గురై జి సుబ్బారెడ్డి, జి. శ్రీనివాసరెడ్డి, జి.నాగార్జునరెడ్డి, సన్నపురెడ్డి తిరుపతమ్మ, బొమ్మారెడ్డి తిరుపతి రెడ్డి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సూరారపు వెంకటేశ్వరరెడ్డి, కందుల వెంకటలక్ష్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలు ఇంటికి వచ్చేసరికి సాయంత్రం కావడంతో బుధవారం అంతిమ యాత్ర నిర్వహించారు.

ఊర్మిళానగర్ మెయిన్ రోడ్‌లోని మృతుల ఇంటి వద్ద నుంచి క్రాంబ్వే రోడ్, జాతీయ రహదారి మీదుగా తిరుపతిరెడ్డిని విద్యాధరపురంలోని హిందూ శ్మశానవాటికలో ఖననం చేయగా, ఒకే కుటుంబంలోని నలుగురిని కృష్ణలంక స్వర్గపురిలో దహనం చేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బట్టిపాటి సంధ్యారాణి, 37వ డివిజన్ కార్పొరేటర్ గాదె  ఆదిలక్ష్మి, వైఎస్సార్ సీపీకి చెందిన 29వ డివిజన్ కన్వీనర్ ఎస్. రామిరెడ్డి, నాయకులు బట్టిపాటి శివ, ఎం.పోలిరెడ్డి, కంది శ్రీని వాసరెడ్డి, 26వ డివిజన్ కన్వీనర్ పోతిరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్, ఎం. వెంగళరెడ్డి, తుమ్మా ఆదిరెడ్డి, టీడీపీ కార్యకర్త కొండ, సీపీఐ 29వ డివిజన్ కార్యదర్శి మాగం ఆత్మారాం తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement