ఎన్నికల అధికారే గైర్హాజర్! | election officer absent! | Sakshi
Sakshi News home page

ఎన్నికల అధికారే గైర్హాజర్!

Jul 8 2014 4:47 PM | Updated on Aug 14 2018 4:44 PM

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నట్లు అధికార టిడిపి వారు తలచుకుంటే ఎన్ని అక్రమాలకైనా పాల్పడగలరని మరోసారి రుజువైంది.

విజయనగరం: రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నట్లు అధికార టిడిపి వారు తలచుకుంటే ఎన్ని అక్రమాలకైనా పాల్పడగలరని  మరోసారి రుజువైంది. కొందరు అధికారులు కూడా వారి తొత్తుల్లా వ్యవహరిస్తారనేది స్పష్టమైపోయింది. జిల్లాలోని మత్స్యకార సొసైటీ సంఘానికి ఈ రోజు ఎన్నికలు జరుగవలసి ఉంది. అయితే ఈ సొసైటీలో వైఎస్ఆర్‌సీపీ మద్దతుదారులు ఎక్కువగా ఉండటంతో  అధికార పార్టీ నేతలు ఈ ఎన్నికల నిర్వహణను వాయిదా వేయించారు. ఏకంగా ఎన్నికలు నిర్వహించవలసిన అధికారే గౌర్హాజరయ్యారు. దాంతో ఎన్నికలను వాయిదా వేశారు.

 ఎన్నికల వాయిదాకు గంగపుత్రులు నిరసన తెలిపారు. వారు ఆందోళనకు దిగారు.  మత్స్యకారుల ఆందోళన కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement