వడదెబ్బకు వృద్ధుడి మృతి | Elderly person dies with sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు వృద్ధుడి మృతి

Apr 18 2015 3:19 AM | Updated on Sep 3 2017 12:25 AM

వడదెబ్బకు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పుత్తూరు మం డల పరిధిలోని తడుకు హరిజనవాడలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

పుత్తూరు రూరల్ : వడదెబ్బకు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పుత్తూరు మండల పరిధిలోని తడుకు హరిజనవాడలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. తడుకు హరిజనవాడకు చెందిన పీ.మునస్వామి(55) ఆరుబయట మల మూత్ర విసర్జనకు పొలాల్లోకి వెళుతూ వడదెబ్బ సోకడంతో తిరుపతి-చెన్నై జాతీయ రహదారి పక్కన స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి చనిపోయాడు. మునస్వామి భార్య, కుమారుడు గతంలోనే మృతి చెందగా, కోడలు జ్యోతి, ఆమె పిల్లలిద్దరినీ సంరక్షిస్తున్నారు. ఆయన మృతితో వారు అనాథలయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement