నేటినుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్లు | EAMCET Web options from today | Sakshi
Sakshi News home page

నేటినుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్లు

Sep 3 2013 6:27 AM | Updated on Sep 17 2018 7:38 PM

జిల్లాకేంద్రంలోని ఫూల్‌బాగ్‌లో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియకు సోమవారం ఆరుగురు అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు.

విజయనగరం టౌన్, న్యూస్‌లైన్: జిల్లాకేంద్రంలోని ఫూల్‌బాగ్‌లో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో  జరుగుతున్న ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియకు సోమవారం  ఆరుగురు అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు.  మూడో తేదీనుంచి 12వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది అభ్యర్థులు ర్యాంకుల వారీగా ఆప్షన్లను  పొందుపర్చుకోవచ్చని పరీక్షల సమన్వయాధికారులు టీఆర్‌ఎస్.లక్ష్మి, భాస్కరరావులు తెలిపారు.
 
 వెబ్ ఆప్షన్ల వివరాలు 
 కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయిన అభ్యర్థులు  వెబ్‌లో  ఆప్షన్లను ఈనెల 3నుంచి ఎంచుకోవచ్చు. ఒకటో ర్యాంకు నుంచి 40వేల ర్యాంకు వరకు  3,4 తేదీల్లోనూ, 40వేల ఒకటి నుంచి 80 వేల ర్యాంకు వరకు 5,6 తేదీల్లోనూ, 80వేల ఒకటి నుంచి లక్షా 20వేలవరకు 7,8 తేదీల్లోనూ, లక్షా 20వేల ఒకటి నుంచి లక్షా 60 వేల వరకు 9, 10 తేదీల్లోనూ, లక్షా 60వేల ఒకటి నుంచి  చివరి ర్యాంకు వరకు 11, 12 తేదీల్లోనూ  అభ్యర్థులు ఆప్షన్లను ఎంచుకోవచ్చని అధికారులు తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement