ఇసుక అమ్మకాలను అడ్డుకున్న డ్వాక్రా మహిళలు | Dwcra Women stage protest against sand sales | Sakshi
Sakshi News home page

ఇసుక అమ్మకాలను అడ్డుకున్న డ్వాక్రా మహిళలు

Jan 18 2016 6:37 PM | Updated on Aug 28 2018 8:41 PM

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ముగ్గల్ల గ్రామంలో ఇసుక విక్రయాలను డ్వాక్రా మహిళలు, కూలీలు సోమవారం అడ్డుకున్నారు.

సీతానగరం : తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ముగ్గల్ల గ్రామంలో ఇసుక విక్రయాలను డ్వాక్రా మహిళలు, కూలీలు సోమవారం అడ్డుకున్నారు. గోదావరి నదీ తీరం వద్ద ఇసుక విక్రయాల బాధ్యతను అధికారులు మండల సమాఖ్యకు అప్పగించారు. అయితే గ్రామానికి చెందిన తమకే ఈ పనులు అప్పగించాలని డ్వాక్రా మహిళలు, ఇసుక రేవులో తమకు పనులు కల్పించాలని కూలీలు డిమాండ్ చేస్తూ ఇసుక విక్రయాలను అడ్డుకున్నారు. పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి బయల్దేరి వెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement