మంత్రి సునీత ఇలాకలో డ్వాక్రా మహిళల ఇబ్బందులు! | DWCRA Women Problems In Minister Paritala Sunitha Area | Sakshi
Sakshi News home page

మంత్రి సునీత ఇలాకలో డ్వాక్రా మహిళల ఇబ్బందులు!

Oct 8 2018 1:39 PM | Updated on Oct 8 2018 1:39 PM

DWCRA Women Problems In Minister Paritala Sunitha Area - Sakshi

సాక్షి, అనంతపురం : మంత్రి పరిటాల సునీత ఇలాకలో డ్వాక్రా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రుణం మంజూరు అయినా వాటిని డ్రా చేయటానికి అనుమంతిచటం లేదు కొందరు అధికారులు. వివరాల్లోకి వెళితే.. అనంతపురానికి చెందిన 16 డ్వాక్రా సంఘాలకు దాదాపు కోటి రూపాయల రుణం మంజూరు అయ్యింది. అయితే డబ్బు డ్రా చేయటంలో వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాప్తాడు ఏపీఎం గోపాల్‌, సీసీ అన్నపూర్ణలు డబ్బు డ్రా చేయటానికి అనుమతించటం లేదు.

దీంతో చిన్మయ్‌ నగర్‌కు చెందిన కొందరు డ్వాక్రా మహిళలు డీఆర్‌డీఏ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు వైఎస్సార్‌ సీపీ, సీపీఎం, బీజేపీ నేతలు తమ మద్దతు తెలిపారు. తొమ్మిది నెలలుగా సమస్య ఉన్నా మంత్రి పరిటాల సునీత పట్టించుకోవటంలేదని డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement