అనూష, అర్జున్‌ టెండుల్కర్‌!.. కూలీ బిడ్డ.. ఆటలో దిట్ట | Ananthapuram: Special Story on Emerging Cricketers Anusha Arjun Tendulkar P | Sakshi
Sakshi News home page

అనూష, అర్జున్‌ టెండుల్కర్‌!.. కూలీ బిడ్డ.. ఆటలో దిట్ట

Oct 11 2026 12:10 PM | Updated on Oct 11 2026 12:17 PM

Ananthapuram: Special Story on Emerging Cricketers Anusha Arjun Tendulkar P

అనూష, పి. అర్జున్‌ టెండుల్కర్‌, మల్లికార్జున

సాక్షి, అనంతపురం: బ్యాట్‌తో పరుగుల వరద.. బంతితో వికెట్ల వేట.. ఆటలో అంకితభావం.. ఇవే  ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన పలువురు క్రికెటర్ల విజయానికి బాటలు వేస్తున్నాయి. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి, రంజీ, దేశవాళీ, ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) సహా వివిధ ఫార్మాట్లలో ప్రతిభను చాటుతూ ఉన్నతస్థాయికి ఎదుగుతున్న వీరు.. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే యువ క్రీడాకారుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నారు.  

మహిళలూ ముందంజలో.. 
క్రేజీ క్రీడ క్రికెట్‌లో పురుషులే కాదు మహిళలు కూడా ముందంజలో ఉంటున్నారు. ముఖ్యంగా ఆర్డీటీ   అందిస్తున్న శిక్షణతో రాటుదేలిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నారు. ఆర్డీటీ, స్థానిక అకాడమీల ప్రోత్సాహంతో జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణిస్తూ ‘అనంత’ కీర్తిని ఇనుమడింపజేస్తున్నారు. ‘సాక్షి సండే స్పెషల్‌’లో పలువురు క్రీడాకారులు, వారి ఘనతల గురించి తెలుసుకుందాం.

రన్‌మెషీన్‌
పేరు : పి.అర్జున్‌ టెండూల్కర్‌ 
ఆటతీరు : కుడిచేతి ఓపెనింగ్‌ బ్యాటర్‌ – రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ –ఆంధ్రప్రదేశ్‌ దేశవాళీ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ క్రీడాకారుడు. క్రికెట్‌ దిగ్గజం పేరును పోలిన ఈ కుర్రాడు, తన ఆటతీరుతో అంచనాలను మించి రాణిస్తున్నాడు. 
స్వగ్రామం: గొట్లూరు గ్రామం, ధర్మవరం మండలం, శ్రీసత్యసాయి జిల్లా  
తల్లిదండ్రులు : పార్వతి, ఆదినారాయణ (క్రికెట్‌ అకాడమీ నిర్వాహకుడు)  

సాధించిన ఘనతలు : ఆంధ్ర అండర్‌–14, అండర్‌–16, అండర్‌–19, అండర్‌–23 జట్లు, అనంతపురం అండర్‌–16, అండర్‌–25 జట్లు. అలాగే ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌)లో  వైజాగ్‌ వారియర్స్, కాకినాడ కింగ్స్, కోస్టల్‌ రైడర్స్‌ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 
భారీ ఇన్నింగ్స్‌: ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ అండర్‌–23 మల్టీ–డే, ఇంటర్‌–డిస్ట్రిక్ట్‌ మ్యాచ్‌లలో ఏకంగా డబుల్‌ సెంచరీ (250+) సాధించాడు. 
కోచ్‌ : ఆర్‌.కుమార్‌  

పరుగుల వీరుడు..  
పేరు : కోగటం హనీష్‌ వీరారెడ్డి  
ఆటతీరు: లెఫ్ట్‌ హ్యాండ్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌ – రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ 
స్వగ్రామం: అనంతపురం 
తల్లిదండ్రులు: కోగటం విజయ   భాస్కరరెడ్డి (మాజీ డిప్యూటీ మేయర్‌), కె.శ్రీదేవి  
ఇతర వివరాలు: అండర్‌–19,    అండర్‌–16 విభాగాలలో ఎన్‌సీఏ క్యాంప్‌కు హాజరయ్యాడు. 
కోచ్‌: టీవీ చంద్రమోహన్‌రెడ్డి  

సాధించిన ఘనతలు: ఆంధ్ర తరఫున అండర్‌–19, అండర్‌–16,     అండర్‌ –23 జట్లలో రాణించాడు. ఏపీఎల్‌లో రాయలసీమ కింగ్స్, సింహాద్రి లయన్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించి సెంచరీ సాధించాడు. కడపలో జరిగిన బీసీసీఐ వినూ మన్కడ్‌ ట్రోఫీలో డబుల్‌ సెంచరీ బాదాడు. సౌరాష్ట్రపై 245 పరుగులు, రాజస్తాన్‌పై సెంచరీ నమోదు చేశాడు. 

బౌలింగ్‌ బెబ్బులి  
పేరు : ఎం.దీపక్‌  
ఆటతీరు: లెఫ్ట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌– లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ 
స్వగ్రామం: అనంతపురం 
తల్లిదండ్రులు: ఎం.రుద్రయ్య (హోటల్‌ నిర్వాహకుడు), ఎం.రూపా  
కోచ్‌లు: టీవీ చంద్రమోహన్‌రెడ్డి, ఆర్‌.కుమార్‌.

సాధించిన ఘనతలు: ఆంధ్ర అండర్‌–16, అండర్‌–19, అండర్‌–23 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2025లో చాంపియన్‌గా నిలిచిన తుంగభద్ర లయన్స్‌ జట్టు తరఫున ఆడాడు. 2022–23లో సౌత్‌ ఇండి యా అండర్‌–19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఏపీఎల్‌లో 4 వికెట్ల హాల్‌ సాధించాడు. బీసీసీఐ ఇంటర్‌ స్టేట్‌ మ్యాచ్‌లలో అండర్‌ –16 (తమిళనాడుపై), అండర్‌–19 (మధ్యప్రదేశ్‌పై), అండర్‌–23 (తమిళనాడుపై) విభాగాల్లో ఐదు వికెట్ల హాల్‌ నమోదు చేశాడు. 

తిరుగులేని దత్తా  
పేరు : మచ్చా కె.దత్తారెడ్డి 
ఆటతీరు: రైట్‌ హ్యాండ్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌ – వికెట్‌ కీపర్‌ 
స్వగ్రామం : అనంతపురం 
తల్లిదండ్రులు: మచ్చా రామలింగారెడ్డి (జర్నలిస్ట్‌), లక్ష్మీదేవి  
కోచ్‌: ఆర్‌.కుమార్‌  

సాధించిన ఘనతలు: ఆంధ్ర అండర్‌–14, అండర్‌–16 జట్లతో క్రికెట్‌ ప్రయాణం ప్రారంభించాడు.    ఆంధ్ర అండర్‌–19 జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా, ఎస్కేయూ క్రికెట్‌ జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించాడు. కూచ్‌ బెహర్‌ ట్రోఫీలో 470 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. రంజీ ట్రోఫీ, కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీ, అండర్‌–23 స్టేట్‌ ఏ ట్రోఫీ, వినూ మన్కడ్‌ ట్రోఫీలలో ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.   అండర్‌–19 ఎన్‌సీఏ క్యాంపునకు ఎంపికయ్యాడు. 

అంతర్జాతీయ కీర్తి  
పేరు: బి.అనూష  
ఆటతీరు: లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ – లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ 
స్వగ్రామం: బండ్లపల్లి, నార్పల మండలం 
తల్లిదండ్రులు: బారెడ్డి మల్లిరెడ్డి (రైతు), లక్ష్మీదేవి  
ఇతర వివరాలు: ఆంధ్ర తరఫున అండర్‌–16, అండర్‌–19, అండర్‌–23 జట్లకు ప్రాతినిధ్యం వహించింది. బీసీసీఐ క్యాంపుల్లో పాల్గొంది. ఇటీవలి డబ్ల్యూపీఎల్‌లో రాయలసీమ గ్జెన్స్‌ తరఫున ఆడి టోర్నీలో మొత్తం 9 వికెట్లు తీసింది.  
కోచ్‌: పి.శర్మాస్‌ వలి.

సాధించిన ఘనతలు: ఆసియా క్రీడలు–2023లో బంగారు పతకం సాధించిన భారత మహిళా క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన టి20, వన్డే టోర్నీలలో ఆడింది. 

జయహో.. జయంత్‌ 
పేరు : ఎ.జయంత్‌ కృష్ణ 
ఆటతీరు: రైట్‌ హ్యాండ్‌ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ / రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌–బ్రేక్‌ బౌలర్‌ 
స్వగ్రామం: తాడిపత్రి
తల్లిదండ్రులు: కృష్ణ, శారద  
కోచ్‌: కేఎస్‌ షాబుద్దీన్‌

సాధించిన ఘనతలు: ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ తరఫున జూనియర్, స్టేట్‌–లెవెల్‌ దేశవాళీ టోర్నీలలో (కూచ్‌ బెహర్‌ ట్రోఫీ, వినూ మన్కడ్‌ ట్రోఫీ) ప్రాతినిధ్యం వహించాడు. ఏసీఏ ఇంటర్‌–డిస్ట్రిక్ట్, స్టేట్‌ ప్రాబబుల్స్‌ మ్యాచ్‌లలో సెంచరీలు, డబుల్‌ సెంచరీ సాధించాడు. అహ్మదాబాద్‌ రిలయన్స్‌ కప్‌లో హాఫ్‌ సెంచరీతో రాణించాడు. అనంత ప్రీమియర్‌ లీగ్‌ (దినేష్‌ గ్రానైట్స్, తాడిపత్రి), వాల్మీకి ప్రీమియర్‌ లీగ్‌తో పాటు అనంతపురం తరఫున సీనియర్‌/ జూనియర్‌ టి20, వన్డే ఇంటర్‌–డిస్ట్రిక్ట్‌ స్క్వాడ్‌లలో పాల్గొన్నాడు. 

కూలీ బిడ్డ.. ఆటలో దిట్ట 
పేరు : జి.మల్లికార్జున  
ఆటతీరు: బౌలర్‌ (లెఫ్ట్‌ ఆర్మ్‌ ఆర్థోడాక్స్‌ స్పిన్‌), రైట్‌ హ్యాండెడ్‌ బ్యాటర్‌ 
 స్వగ్రామం: రాప్తాడు 
తల్లిదండ్రులు: మహేష్‌ (లేట్‌), ఉమాదేవి (కూలీ).
కోచ్‌: ఆర్‌.కుమార్‌. 

సాధించిన ఘనతలు: విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీ (అండర్‌–16), కూచ్‌ బెహర్‌ ట్రోఫీ (అండర్‌–19), అండర్‌–23 ఆంధ్ర రాష్ట్ర జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. వైజాగ్‌ వారియర్స్, తుంగభద్ర వారియర్స్‌ / అమరావతి రాయల్స్‌ తరఫున ఏపీఎల్‌లో ఆడాడు. హర్యానాతో జరిగిన కూచ్‌ బెహర్‌ ట్రోఫీ మ్యాచ్‌లో 10 వికెట్లు తీశాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement