శుభవార్త | DSC PH Backlog posts replacement | Sakshi
Sakshi News home page

శుభవార్త

Mar 16 2018 9:19 AM | Updated on Jun 1 2018 8:45 PM

DSC PH Backlog posts replacement - Sakshi

అనంతపురం ఎడ్యుకేషన్‌: జీఓలు 23, 99 అమలులో భాగంగా డీఎస్సీ దివ్యాంగుల కేటగిరీలో(పీహెచ్‌) బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో భాగంగా 2014 డీఎస్సీ ఎస్జీటీ కేడర్‌లో మిగిలిపోయిన 17 పీహెచ్‌ పోస్టులను భర్తీ చేసేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. అర్హులైన అభ్యర్థులకు  సమాచారం అందించారు. శుక్రవారం సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. ఎంపికైన వారి వికలత్వ ధ్రువీకరణ పత్రాలను విశాఖపట్నంలోని కింగ్‌జాన్స్‌ ఆస్పత్రికి పంపనున్నారు. అక్కడి నుంచి వికలత్వ శాతం ధ్రువీకరణ వచ్చిన తర్వాత పోస్టులు ఇవ్వనున్నారు.

ఆ మూడు డీఎస్సీ వివరాలు పంపండి
98, 2008, 2012 సంవత్సరాల డీఎస్సీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈనెల 19లోగా పంపాలని కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో విద్యాశాఖ అధికారులు వివరాలు పంపే పనిలో నిమగ్నమయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement