
దివ్యాంగులకు పింఛన్ పెంచి ఆదుకున్న ఘనత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిదే. ఆయన మేలు ఎన్నటికీ మరువలేం. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 70 రూపాయలుగా ఉన్న పింఛన్‌ను 200 రూపాయలకు పెంచారు. ఆ తర్వాత 500 రూపాయలు చేశారు. మాకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిన సమయంలోనే ఆయన దుర్మరణం పాలవ్వడం బాధాకరం. దివ్యాంగులకు మూడు వేల రూపాయల పింఛన్ ఇస్తామని జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇవ్వడం ఆనందించదగ్గ విషయమన్నారు. జగనన్నకు మద్దతు పలికేందుకే పాదయాత్రకు వచ్చాం.
– ఎన్.జేసుదాసు, మజ్జి గౌరినాయుడు, దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి, గంట్యాడ