రాష్ట్ర విభజన అనివార్యమని, విభజనకు సీమాంధ్రులు సహకరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.
హైదరాబాద్ : రాష్ట్ర విభజన అనివార్యమని, విభజనకు సీమాంధ్రులు సహకరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఎస్సీ, ఎస్టీలకు ఈ ఏడాది మూడు లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు ఆయన శుక్రవారం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి రూ.1300 కోట్ల అదనపు నిధులు విడుదల చేస్తున్నట్లు ఉత్తమ్ కమార్ రెడ్డి పేర్కొన్నారు. వీహెచ్ వాహనంపై దాడిని ఆయన ఖండించారు.
కాగా నల్గొండ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ఉదయం అధికారులతో సమీక్షించారు. వరద బాధితులకు మెరుగైన వైద్య, ఆహార సదుపాయాలు కల్పించాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన బాధితులకు సాయం చేయాలని ఆదేశించారు.