ఎస్పీగా దీపికకు పదోన్నతి

DISHA Special Officer Deepika Promoted As Superintendent of Police - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక దిశ చట్టం పటిష్ట అమలుకై ప్రత్యేక అధికారిణిగా నియమితులైన ఐపీఎస్‌ దీపికకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రస్తుతం సీఐడీ అదనపు డీజీపీ కార్యాలయంలో దిశ ప్రత్యేక అధికారిగా పనిచేస్తున్న ఐపీఎస్‌ అధికారిణి దీపికకు ఎస్పీగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్పీ హోదాలో మంగళగిరి డీజీపీ కార్యాలయంలో దిశ ప్రత్యేక అధికారిగా దీపికను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా దిశ చట్టం అమలులో భాగంగా ఇద్దరు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఐఏఎస్‌ విభాగంలో కృతికా శుక్లా, ఐపీఎస్‌ విభాగంలో దీపిక దిశ ప్రత్యేక అధికారిణిలుగా నియమితులయ్యారు. (‘దిశ’ కాల్‌తో అర్ధరాత్రి బాలికకు రక్షణ)

దిశ చట్టంలో ప్రత్యేకతలు

 • మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపుల కేసుల్లో ఐపీసీ 354 ఎఫ్, 354 జి సెక్షన్లను అదనంగా చేర్చారు. 
 • ఏడు రోజుల్లో దర్యాప్తు, 14 పని రోజుల్లో విచారణ పూర్తి
 • దిశ చట్టం కింద నమోదైన కేసులను డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు
 • దర్యాప్తు కోసం రాష్ట్రంలో 18 ప్రత్యేక దిశ పోలీస్‌ స్టేషన్లు
 •  ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా దిశ కోర్టులు
 • 13 మంది ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం
 • రేప్, గ్యాంగ్‌ రేప్‌లకు పాల్పడితే ఉరిశిక్ష
 • చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవితఖైదు
 • సోషల్‌ మీడియా, డిజిటల్‌ మీడియాలో మహిళలను వేధిస్తే మొదటిసారి రెండేళ్లు జైలు శిక్ష. రెండోసారి తప్పు చేస్తే నాలుగేళ్లు జైలు శిక్ష
 • అత్యాచారం కేసుల్లో శిక్ష పడిన దోషులు అప్పీలు చేసుకునే గడువు 180 రోజుల నుంచి 45 రోజులకు కుదింపు.
 • మహిళలు, చిన్నారులపై అకృత్యాలకు పాల్పడే వారి వివరాలను అందరికీ తెలిసేలా డిజిటల్‌ (ఆన్‌లైన్‌) రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.
 • మంగళగిరి, విశాఖపట్నం, తిరుపతిలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల ఆధునికీకరణ
 • తిరుపతి, విశాఖపట్నంలో రెండు డీఎన్‌ఏ సెంటర్లు
 • బయాలజీ, సెరాలజీ, సైబర్‌ ల్యాబ్‌లు
 • దిశ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే వారికి 30 శాతం ప్రత్యేక అలవెన్సు
 • కేసుల దర్యాప్తునకు నెలకు రూ.లక్ష
 • రాష్ట్రంలో మహిళా పోలీస్‌ స్టేషన్ల అప్‌గ్రేడేషన్‌. ఒక డీఎస్పీ,  మూడు ఎస్‌ఐ పోస్టులు మంజూరు
 • బాధితుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో గైనకాలజీ పోస్టుల భర్తీ
 • అన్యాయానికి గురైన మహిళ రాష్ట్రంలో ఎక్కడైనా ఫిర్యాదు చేసేలా జీరో ఎఫ్‌ఐఆర్‌ సౌకర్యం. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top