మధ్యంతర భృతి 22శాతం మించి ఇవ్వలేం | Discussions continued on Interim allowance | Sakshi
Sakshi News home page

మధ్యంతర భృతి 22శాతం మించి ఇవ్వలేం

Jan 1 2014 8:21 PM | Updated on May 28 2018 4:15 PM

ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డితో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతల చర్చలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్: మధ్యంతర భృతిపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఉద్యోగ సంఘాల నేతలతో ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి జరిపిన చర్చలు ముగిశాయి. ఉద్యోగ సంఘాలకు ఇచ్చే మధ్యంతర భృతిపై 22శాతం మించి ఇవ్వలేమని ప్రభుత్వం పేర్కొంది. ఈ చర్చల్లో  ఉద్యోగసంఘాలు 32శాతమైనా ఇవ్వాలని  ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. దీంతో ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో  32శాతం మధ్యంతర భృతి ఇవ్వలేమని చెప్పినట్టు తెలిసింది.

అయితే రేపు ఉదయం 11.30 గంటలకు క్యాంప్ ఆఫీస్లో మధ్యంతర భృతిపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరపనున్నట్టు సమాచారం.  కాగా, మధ్యంతర భృతిపై చర్చించేందుకు  మంత్రి ఆనంతో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు బుధవారం సమావేశమైన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement