మెట్టవలసపై డయేరియా పంజా

Diarrhea Spread in Srikakulam Mettavalasa - Sakshi

గ్రామంలో 52 మంది బాధితులు

తాగునీరు కలుషితం కావడమే కారణం  

శ్రీకాకుళం, జి.సిగడాం: మండలం మెట్టవలస గ్రామంలో డయేరియా పంజా విరిసిరింది. ఒకేసారి 52 మందికి వ్యాధి వ్యాపించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గ్రామంలో తోండ్రోతు వైకుంఠం, తోండ్రోతు కన్నారావు, పరశురాం, ఎడ్ల స్వాతి, శ్రావణి, లాభాన పావని, పైల సత్యవతి, చందక విమల, అప్పలరాజుల, భాగ్యలక్ష్మితోపాటు మరో 42 మంది డయేరియా బారిన పడ్డారు. వీరికి స్థానిక వైద్యాధికారి పొన్నాడ హరితశ్రీ వైద్యం అందించారు. భాగ్యలక్ష్మి అనే మహిళ పరిస్థితి విషమించడంతో రాజాం ఆస్పత్రికి తరలించారు. 

అధికారుల సందర్శన  
గ్రామంలో డయేరియా ప్రబలిందని తెలుసుకున్న జిల్లా అదనపు వైద్యాధికారి బగాది జగన్నాథరావు, డీపీఓ బి.రవికుమార్‌తో పాటు తహసీల్దార్‌ మందుల లావణ్య, ఎంపీడీఓ కె.శ్రీనివాసరావు గ్రామాన్ని సందర్శించారు. తాగునీరు కలుషితం కావడం వల్ల వ్యాధి ప్రబలి ఉండవచ్చని తెలిపారు. గ్రామంలో 52 మందికి డయేరియా వచ్చినా అధికారులు ఎందుకు గోప్యత పాటించారో తెలీడం లేదు. రెండురోజులుగా గ్రామంలో బాధితుల సంఖ్య పెరుగుతున్నా బయటకు సమాచారం తెలియనీయలేదు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top