కోడెల మృతి బాధాకరం: ధర్మాన కృష్ణదాస్

Dharmana Krishna Das Says It Is Sad To Hear The Demise Of Kodela - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మృతి బాధాకరమని ఏపీ ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కోడెల మృతిపై ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మంగళవారం ధర్మాన విలేకరులతో మాట్లాడుతూ.. తమ‌ పార్టీకే చెందిన నేత మృతిని ఇలా రాజకీయ లబ్ది కోసం వాడుకోవడం చంద్రబాబుకే చెల్లిందని ఎద్దేవా చేశారు. కోడెల మరణంపై చంద్రబాబు రాజకీయం చేయడం ‌తగదని అభిప్రాయపడ్డారు. కుటుంబంలో నెలకొన్న భేదాభిప్రాయాల కారణంగానే కోడెల బలవన్మరణం పొందారని స్వయానా అతని మేనల్లుడే పోలీసులకు ఫిర్యాదు చేశారని ఈ సందర్భంగా ధర్మాన పేర్కొన్నారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశించిందని, కొద్ది రోజుల్లో వాస్తవాలు వెలువడతాయని ఆయన తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top