బాసరకు పోటెత్తిన భక్తులు | Devotees Rush Continues in Basara | Sakshi
Sakshi News home page

బాసరకు పోటెత్తిన భక్తులు

Aug 11 2013 9:45 AM | Updated on Sep 1 2017 9:47 PM

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం ఆదివారం సెలవు కావడంతో బాసరకు భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి, అక్షరాభ్యాసానికి ఐదు గంటల సమయం వేచిచూడాల్సి వస్తోంది.

మరోవైపు నాగుల పంచమి సందర్భంగా జిల్లాలోని ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుట్టలో పాలు పోసి, పూజలు చేస్తున్నారు. గుడిహత్నూర్ మండలం మచ్చాపూర్లోని నాగోబా ఆలయంలో జాతర ప్రారంభయింది. చుట్టుపక్కలవారే కాకుండా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement