తిరుమల శ్రీవారికి భారీగా విరాళాలు..

Devotees Gave Huge Donations For Lord Venkateshwara - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పరిధిలోని వివిధ ట్రస్తులకు శుక్రవారం రూ.4.5 కోట్ల విరాళాలు అందాయి. ఇందులో  ఓ అజ్ఞాత భక్తుడు టీటీడీలోని వివిధ ట్రస్టులకు రూ.2.4 కోట్లను విరాళంగా అందించాడు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి ఆ దాత డీడీని అందజేశాడు. అయితే మరి కొందరు దాతలు 2.1 కోట్లను  విరాళంగా ఇవ్వగా వీటిలో అన్నప్రసాదానికి రూ.కోటి, గోసంరక్షణ ట్రస్టుకు రూ.10లక్షలు, శ్రీనివాస శంకరనేత్రాలయ ట్రస్టుకు రూ.10 లక్షలు, బర్డ్‌ ఆసుపత్రి ట్రస్టుకు రూ.40లక్షలు, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.20లక్షలు, ప్రాణ దాన ట్రస్టుకు రూ.30లక్షల విరాళాలను భక్తులు టీటీడీ అధికారులను కలసి అందజేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top