సాయానికి ముందుకు రండి

Department of Medical Health Call to donors For Charities - Sakshi

మాస్కులు, శానిటైజర్లు అందించండి

యువకులు క్వారంటైన్‌ల వద్ద పనిచేసేందుకు ముందుకు రావాలి

దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ పిలుపు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా మహమ్మారిని నిరోధించి బాధితులకు అండగా నిలిచేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ప్రభుత్వం కోరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా.కె.జవహర్‌రెడ్డి ఓ లేఖ రాశారు. కరోనాను నియంత్రించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే గట్టి చర్యలు చేపట్టారని, దీనికి అంతా మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు.

సర్జికల్‌ మాస్కులు, ఎన్‌ 95 మాస్కులు, పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌లు, శానిటైజర్లు సాయంగా అందించవచ్చు. 
మొబైల్‌ ఎక్స్‌రే మెషీన్లు, వెంటిలేటర్లు, పల్సాక్సీ మీటర్లు, బై–పాప్స్‌లను అందించండి
స్పెషలిస్టు వైద్యులు, ఎంబీబీఎస్‌ వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది సేవలందించండి.
25 నుంచి 35 ఏళ్లలోపు వారు క్వారంటైన్‌ కేంద్రాలు, ఐసొలేషన్‌ వార్డుల వద్ద పనిచేయడానికి ముందుకు రావాలి. 
ఐసొలేషన్‌ సెంటర్లు, క్వారంటైన్‌ కేంద్రాలు, హాస్పిటళ్లకు ఆహారం, మంచినీరు, దుస్తులు, పారిశుధ్య నిర్వహణకు ముందుకు రావాలి.
ప్రభుత్వమే రవాణా సౌకర్యం కల్పిస్తుంది.
జిల్లా కలెక్టర్‌ లేదా రెవెన్యూ అధికారులకు సాయం వివరాలు అందించవచ్చు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top