కళాశాలకు వచ్చిన ఓ విద్యార్థి రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనంతపురంలో శుక్రవారం చోటు చేసుకుంది.
అనంతపురం: కళాశాలకు వచ్చిన ఓ విద్యార్థి రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనంతపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాప్తాడు మండలం గాండ్లపర్తికి చెందిన రవి (21) నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలకు వెళ్లేందుకని ఉదయం ఇంటి నుంచి బయలుదేరి వచ్చాడు.
పట్టణంలోని పీటీసీ మైదానం ఎదురుగా రైలుపట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు పట్టాల మధ్య పడుకున్నాడని పోలీసులకు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్‌ఐ ఇస్మాయిల్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద లభించిన వివరాల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(రాప్తాడు)