బధిరురాలిపై సామూహిక అత్యాచారం | deaf girl gang raped | Sakshi
Sakshi News home page

బధిరురాలిపై సామూహిక అత్యాచారం

Aug 18 2015 6:49 PM | Updated on Sep 3 2017 7:40 AM

బధిరురాలిని ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు.

కొవ్వూరు (పశ్చిమగోదావరి జిల్లా) : బధిరురాలిని ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొంగరి గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. దొంగరి గ్రామానికి చెందిన బధిరురాలిపై అదే గ్రామానికి చెందిన నవీన్, మహేష్, చక్రవర్తిలు సోమవారం అర్ధరాత్రి అత్యాచారానికి పాల్పడ్డారు.

కాగా మంగళవారం విషయం తెలిసిన గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement