‘బంగారుతల్లి’ని చిదిమేశారు.. | Dead baby found in trash bin in nirmal | Sakshi
Sakshi News home page

‘బంగారుతల్లి’ని చిదిమేశారు..

Jan 1 2014 2:50 AM | Updated on Sep 2 2017 2:09 AM

భారమనుకున్నారో.. భరించలేమనుకున్నారో.. చేసిన తప్పుకు సాక్షిగా నిలుస్తుందనుకున్నారో తెలియదు కానీ అభంశుభం తెలియని బంగారు తల్లిని బలి గొన్నారు.

నిర్మల్ అర్బన్, న్యూస్‌లైన్: భారమనుకున్నారో.. భరించలేమనుకున్నారో.. చేసిన తప్పుకు సాక్షిగా నిలుస్తుందనుకున్నారో తెలియదు కానీ అభంశుభం తెలియని బంగారు తల్లిని బలి గొన్నారు. నెలలైనా నిండకుండానే.. కళ్లు తెరవకముందే ఆడశిశువును చిదిమేశారు. ఆపై ముళ్లపొదల్లో పడేశారు. అందరినీ కలచివేసిన ఈ సంఘటన నిర్మల్ మండలం గంజాల్ గ్రామ సమీపంలో జరిగింది. సోన్ ఎస్సై వెంకటేశ్ తెలిపిన వివరాలిలా ఉన్నారుు.
 
 గంజాల్ గ్రామంలో తోట పెద్దమల్లయ్యకు చెందిన పశువుల పాక సమీపంలోని ముళ్లపొదల్లో మంగళవారం నెలలు నిండని పసికందు మృతదేహం లభ్యమైంది. చేను వద్దకు వెళ్లిన మల్లయ్యకు ముళ్లపొదల్లో ఆడశిశువు మృతదేహం కనిపించడంతో సర్పంచ్‌కు సమాచారం అందించాడు. సోన్ నీటి సంఘం అధ్యక్షుడు మొరుునుద్దీన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎస్సై వెంకటేశ్‌కు సమాచారం అందించారు. పోలీసులు చేరుకుని పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముళ్లపొదల్లో చీమలు పట్టి ఉన్న శిశువు మృతదేహాన్ని చూసిన ప్రతీఒక్కరూ కంటతడి పెట్టారు. పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించామని, శిశువు సోమవారం జన్మించి ఉండొచ్చని ఎస్సై తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు తెలియూల్సి ఉందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement