
'ఆ వాస్తవాలు అప్పుడే బయటపెట్టాల్సింది'
కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదం తేలిపోయిందని మంత్రి దానం నాగేందర్ అన్నారు.
హైదరాబాద్ : కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదం తేలిపోయిందని మంత్రి దానం నాగేందర్ అన్నారు. సీఎం తమను మభ్యపెట్టి, మోసం చేశారని సీమాంధ్ర మంత్రులే అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కిరణ్కు నైతిక విలువలు, సమైక్యవాదం గౌరవం ఉంటే సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడే రాజీనామా చేసేవారని దానం అన్నారు. రాజీనామా చేయకుంటే సాగనంపేవారని ఆయన వ్యాఖ్యానించారు.
హైకమాండ్ నుంచి కిరణ్‌కు పూర్తి సంకేతాలున్నాయని అన్నారు. స్వార్థప్రయోజనాల కోసమే కిరణ్ డ్రామాలాడాన్నారు. సీమాంధ్ర ప్రజల క్రెడిట్ కోసం కిరణ్ రాజీనామా చేశారన్నారు. కేంద్రం ప్యాకేజీలు ఇస్తామన్నపుడు...ఆ వాస్తవాలు అప్పుడే బయట పెట్టాల్సిందనారు.
ముఖ్యమంత్రి హడావిడి నిర్ణయాలపై తెలంగాణ ప్రభుత్వంలో విచారణ చేయిస్తామని దానం తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన పేర్కొన్నారు.