కారు ఢీకొని సైక్లిస్టు మృతి | cyclist dies in road accident in west godhavari district | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని సైక్లిస్టు మృతి

May 15 2016 3:28 PM | Updated on Apr 3 2019 8:07 PM

పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం వనగట్ల వద్ద కారు ఢీకొనడంతో సైకిల్‌పై వెళుతున్న ఓ వ్యక్తి మృతి చెందాడు.

చాగల్లు: పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం వనగట్ల వద్ద కారు ఢీకొనడంతో సైకిల్‌పై వెళుతున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. వనగట్ల గ్రామానికి చెందిన నూతంగి వెంకట్రావ్ (40) ఆదివారం మధ్యాహ్నం సైకిల్‌పై వెళుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడడంతో వెంకట్రావ్ ప్రమాద స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement