పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలకు వ్యతిరేకంగా సీపీఎం రాస్తా రోకో నిర్వహించింది.
పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ సీపీఎం రాస్తారోకో చేపట్టింది. మొగల్తూరు గాంధీ బొమ్మ సెంటర్‌లో పార్టీ కార్యకర్తలు శనివారం ఉదయం గంటసేపు రాస్తారోకో చేపట్టారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు.