అంత అనుభవం ఉన్న మీరు ఇలా చేస్తారా ? | CPI state Secretary Ramakrishna takes on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

అంత అనుభవం ఉన్న మీరు ఇలా చేస్తారా ?

Jul 15 2014 12:15 PM | Updated on Aug 13 2018 4:30 PM

అంత అనుభవం ఉన్న మీరు ఇలా చేస్తారా ? - Sakshi

అంత అనుభవం ఉన్న మీరు ఇలా చేస్తారా ?

రైతుల రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

రైతుల రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లో రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ... రైతు రుణమాఫీ చేస్తామంటూ చంద్రబాబు కాలయాపన చేయడంతో రైతుల్లో తీవ్ర గందరగోళం నెలకొందన్నారు. తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రిగా పని చేశానని... తనకు అపార అనుభవం ఉందని చెప్పుకునే మీకు రుణమాఫీ హామీ ఇచ్చేముందు పరిస్థితి తెలియలేదా అంటూ చంద్రబాబును రామకృష్ణ సూటిగా ప్రశ్నించారు. గతంలో సీఎంగా పని చేసిన మీరు ఇలా చేస్తారా అంటూ చంద్రబాబుని రామకృష్ణ నిలదీశారు. 

 

తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు కలసి కూర్చొని చర్చించాలని  చంద్రబాబు, కేసీఆర్లకు సూచించారు. పోలవరం ప్రాజెక్టు అంశంలో సహకరించాలని తెలంగాణ నేతలకు విజ్ఞప్తి చేశారు. పోలవరం నిర్వాసితులకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలదే అని రామకృష్ణ స్సష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement