'ప్రతిపక్ష ధర్నా విఫలం చేసేందుకు టీడీపీ కుట్ర' | cpi ramakrishna fires on tdp government | Sakshi
Sakshi News home page

'ప్రతిపక్ష ధర్నా విఫలం చేసేందుకు టీడీపీ కుట్ర'

Aug 6 2015 7:38 PM | Updated on Aug 13 2018 4:30 PM

'ప్రతిపక్ష ధర్నా విఫలం చేసేందుకు టీడీపీ కుట్ర' - Sakshi

'ప్రతిపక్ష ధర్నా విఫలం చేసేందుకు టీడీపీ కుట్ర'

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 12న ఢిల్లీలో చేపట్టనున్న ధర్నాను విఫలం చేసేందుకు కేంద్రమంత్రులు సుజనాచౌదరి, వెంకయ్యనాయుడు కుట్రలు పన్నుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు.

నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 12న ఢిల్లీలో చేపట్టనున్న ధర్నాను విఫలం చేసేందుకు కేంద్రమంత్రులు సుజనాచౌదరి, వెంకయ్యనాయుడు కుట్రలు పన్నుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. సీపీఐ చేపట్టిన బస్సు యాత్ర గురువారం సాయంత్రం నెల్లూరు జిల్లా కేంద్రానికి చేరుకుంది.

ఈ సందర్భంగా జరిగిన సభలో కె.రామకృష్ణ మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించటంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. బీజేపీ ఇచ్చిన రెండు కేంద్ర మంత్రి పదవులతో సరిపెట్టుకుంటారో లేక ప్రత్యేక హోదా సాధించేందుకు కట్టుబడి ఉంటారో సీఎం చంద్రబాబు  తేల్చుకోవాలని రామకృష్ణ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement