ఏపీలో కొత్తగా 1555 పాజిటివ్‌ కేసులు | Covid 19 Update 1555 New Cases Reported In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో మరో 1555 కరోనా కేసులు

Jul 9 2020 2:40 PM | Updated on Jul 9 2020 7:16 PM

Covid 19 Update 1555 New Cases Reported In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1500 కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 53 మందికి, ఇతర దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో ఇద్దరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కొత్త కేసుల సంఖ్య 1555కు చేరింది. అదే విధంగా గడిచిన 24 గంటల్లో 904 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ అయ్యారు. 

ఇక కరోనా కారణంగా కర్నూలు జిల్లాలో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, అనంతపూర్‌లో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, కృష్ణలో ఒక్కరు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు, చిత్తూరులో ఒక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా మరణాల సంఖ్య 277కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం హెల్త్‌బులెటిన్‌ విడుదల చేసింది. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 10,94,615 శాంపిల్స్‌ పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో 16,882 మందికి పరీక్షలు నిర్వహించారు. అదే విధంగా రాష్ట్రంలో ప్రస్తుతం 11,383 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement