శాసనసభ్యులకు కోవిడ్‌–19 పరీక్షలు

Covid-19 tests for Andhra Pradesh legislators - Sakshi

సాక్షి, గుంటూరు: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోందని శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి అన్నారు. మంగళవారం నుంచి శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ముందస్తు చర్యలలో భాగంగా సోమవారం నగరంపాలెంలోని ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కోవిడ్‌–19 పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఎక్కువ కరోనా పరీక్షలు నిర్వహించారని చెప్పారు. చదవండి: అక్రమాలకు అంతే లేదు..


కరోనా పరీక్ష చేయించుకున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

శాసన సభ్యులందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని సమావేశాలకు హాజరుకావాలని అన్నారు. పరిమితికి మించి సిబ్బందిని తీసుకురావద్దని సభ్యులకు సూచించారు.అనివార్య కారణాల వలన పరీక్షలకు హాజరుకాని వారికి అసెంబ్లీ వద్ద పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, శాసన మండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు.

కరోనా పరీక్షకు హాజరైన ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముస్తఫా  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top