వాళ్లు స్వయంగా ఆస్పత్రికి వెళ్లాలి : పెద్దిరెడ్డి | Coronavirus Everyone Follow Social Distancing Peddireddy Ramachandra Reddy Says | Sakshi
Sakshi News home page

వాళ్లు స్వయంగా ఆస్పత్రికి వెళ్లాలి : పెద్దిరెడ్డి

Apr 6 2020 1:05 PM | Updated on Apr 6 2020 1:09 PM

Coronavirus Everyone Follow Social Distancing Peddireddy Ramachandra Reddy Says - Sakshi

సాక్షి, తిరుపతి : ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు స్వయంగా ఆస్పత్రికి వెళ్లి కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. అందరూ కొద్ది రోజుల పాటు భౌతికంగా దూరం పాటించాలని కోరారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడే ద్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. తిరుపతిలో పలు ప్రాంతాల్లో రెడ్‌ జోన్‌ ప్రకటన ఉందని.. ప్రజలు గుంపులుగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షాపుల వద్ద ప్రజలు గుంపులుగా ఉండకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

Advertisement
 
Advertisement
Advertisement