రెడ్‌ జోన్ల వారీగా పరీక్షలు

Coronavirus: CM YS Jagan High Level Review On Covid-19 Prevention - Sakshi

విశాఖ తరహాలో క్లస్టర్ల వారీగా ర్యాండమ్‌ పరీక్షలపై దృష్టి పెట్టాలి

కోవిడ్‌ వ్యాప్తి నివారణ చర్యలపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం జగన్‌

క్వారంటైన్, ఐసోలేషన్‌ క్యాంపుల్లో మంచి సదుపాయాలు కల్పించాలి

కోవిడ్‌ ఆస్పత్రుల సన్నద్ధతపై మరింత దృష్టి పెట్టాలి

వైరస్‌ ప్రభావిత ప్రాంతాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి

పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్లు, మాస్కులు తగినన్ని ఉంచాలి

1092కు వచ్చిన ప్రతికాల్‌కు వెంటనే స్పందించి,సమస్య పరిష్కరించాలి

స్వచ్ఛంద సంస్థల ద్వారా టెలీ మెడిసిన్‌ సర్వీసులు అందించాలి

సహాయక శిబిరాల్లో మెరుగైన సదుపాయాలు ఉండాలి

కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొత్త విధానాలకు ఐసీఎంఆర్‌ అనుమతివ్వడంతో ప్రాథమిక స్థాయి పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఏర్పడింది. దీని ప్రకారం త్వరలో రాష్ట్రానికి 240 పరికరాలు రానున్నాయి. ఒక్కో పరికరం ద్వారా రోజుకు కనీసం 20 శాంపిళ్లను పరీక్షించే అవకాశం ఉంటుంది. దీంతో ప్రాథమిక స్థాయి పరీక్షల్లో వేగం పెరిగి, సత్వర చర్యలకు వీలుంటుంది. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ ప్రారంభించాలి.

ఢిల్లీ సదస్సు నుంచి వచ్చిన వారికి, వారితో కలిసి మెలిగిన (ప్రైమరీ కాంటాక్ట్స్‌) వారికి దాదాపు పరీక్షలు పూర్తి చేశారు. సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 266 కేసులు నమోదైతే, ఇందులో 243 కేసులు ఢిల్లీ సదస్సుకు హాజరైన వారు,వారిని కాంటాక్ట్‌ అయిన వారివే.

వ్యాధి నిరోధకత ద్వారా కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న వారి నుంచి నమూనాలు సేకరించి కొత్త వైద్య విధానాలు రూపొందించుకునే విషయమై అడుగులు ముందుకు వేయాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌–19 వ్యాప్తి నివారణలో భాగంగా విశాఖ తరహాలో రెడ్‌ జోన్లు, క్లస్టర్ల వారీగా ర్యాండమ్‌ పరీక్షలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ర్యాండమ్‌ టెస్టు కిట్ల ద్వారా ప్రజల నుంచి నమూనాలు సేకరించి, ఆ మేరకు డేటాను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుని పరిస్థితులను అంచనా వేయాలని సూచించారు. కోవిడ్‌–19 వ్యాప్తి నివారణ చర్యలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలే కాకుండా భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు, సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. 

వేగవంతంగా పరీక్షలు
► వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే ద్వారా వ్యాధి లక్షణాలు ఉన్న వారి గుర్తింపు. వీరిలో ఎవరెవరికి పరీక్షలు చేయించాలన్న దానిపై వైద్యులు నిర్ధారిస్తున్నారు. త్వరలో వీరందరికీ కూడా పరీక్షలు నిర్వహిస్తారు. విశాఖపట్నం, గుంటూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ల్యాబ్‌ల సామర్థ్యం పెంపు.
► స్వచ్ఛంద సంస్థల ద్వారా టెలీ మెడిసిన్‌ సర్వీసులు అందించడానికి ఏర్పాట్లు. ఐసోలేషన్‌లో ఉన్న వారు ఎవరైనా ఫోన్‌ చేసి వైద్యం పొందవచ్చు. 
► క్వారంటైన్, ఐసోలేషన్‌ క్యాంపుల్లో సదుపాయాలను మెరుగు పరచాలి. సదుపాయాల్లో నాణ్యత ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో రూపొందించుకున్న స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) ప్రకారం ముందు కెళ్లాలి. 
సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ప్రత్యేక ఆసుపత్రులపై మరింత దృష్టి
కోవిడ్‌ ఆసుపత్రుల సన్నద్ధతపై మరింత దృష్టి పెట్టాలి. ప్రతి ఆసుపత్రిలోనూ ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటు, పనితీరు పట్ల ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలి. ఐసీయూ బెడ్లు, వాటి సంఖ్యకు తగినట్టుగా వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. 
► వారం రోజుల పాటు సేవలు అందించిన వైద్య సిబ్బందిని తర్వాత 14 రోజుల పాటు ఐసోలేషన్‌కు పంపించేలా రూపొందించుకున్న ప్రణాళిక పక్కాగా అమలు చేయాలి. ఇందుకు ఎక్కువ మంది వైద్యులు, సిబ్బంది అవసరం. తగిన చర్యలు తీసుకోవాలి. 
► కోవిడ్‌–19 ప్రభావిత ప్రాంతాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చి పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్లు, మాస్కులు తగినన్ని అందుబాటులో ఉంచాలి. 

క్యాంపుల్లో మెరుగైన సదుపాయాలు
► గుజరాత్‌లో ఉన్న తెలుగు వారి బాగోగులు చూసుకోవడానికి ఏపీ నుంచి ప్రత్యేకంగా వెళ్లిన అధికారుల బృందం. అక్కడ తెలుగు వారందరికీ భోజన, ఇతర సదుపాయాల కల్పన. 
► రాష్ట్రంలోని ప్రత్యేక క్యాంపుల్లో సదుపాయాల కల్పన. క్యాంపు అధికారిగా హాస్టల్‌ వార్డెన్లు. జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి నియామకం. ఎప్పటికప్పుడు పరిస్థితిపై పర్యవేక్షణ.
► అవసరాలకు అనుగుణంగా క్యాంపుల పెంపు. అన్ని రకాల సదుపాయాల కల్పన. 
► 1902కు వచ్చిన కాల్స్‌ ద్వారా ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి చర్యలు. ప్రతి కాల్‌కు స్పందించాల్సిందే. 

ఈ సమావేశంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

24-05-2020
May 24, 2020, 06:36 IST
సాక్షి, హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ను మరికొంతకాలం పొడిగిస్తే.. ప్రజా జీవనం స్తంభించి పేద, మధ్య తరగతి ప్రజలు తమ జీవనోపాధి...
24-05-2020
May 24, 2020, 06:32 IST
వాషింగ్టన్‌: ఈఏడాదికి అమెరికాలో తమ చదువులను పూర్తి చేసుకున్న విద్యార్థులకు వర్చువల్‌ స్నాతకోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో...
24-05-2020
May 24, 2020, 06:15 IST
ప్రముఖ మలయాళ నటుడు సురేష్‌ గోపి త్వరలోనే ఓ కొత్త మైలు రాయిని అందుకోబోతున్నారు. నటుడిగా 247 సినిమాల వరకూ...
24-05-2020
May 24, 2020, 06:09 IST
‘‘రంగేయడానికి ఒకళ్లు.. జడేయడానికి ఒకళ్లు.. బాగానే ఉంది దర్జా.. హ్హహ్హహ్హ’’.... ‘మహానటి’ సినిమాలోని డైలాగ్‌ ఇది. సావిత్రి పాత్రధారి కీర్తీ...
24-05-2020
May 24, 2020, 05:58 IST
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్‌ స్టోరీ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు శేఖర్‌ కమ్ముల. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి...
24-05-2020
May 24, 2020, 05:50 IST
బెర్లిన్‌: లాటిన్‌ అమెరికాలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆ దేశాల్లో ప్రభుత్వాల నిర్లక్ష్యమే కేసుల్ని పెంచేస్తోంది. బ్రెజిల్, మెక్సికోలో...
24-05-2020
May 24, 2020, 05:35 IST
రెండు నెలలు దాటిపోయింది ప్రపంచం స్తంభించిపోయి.. సినిమా ఆగిపోయి. పనులు మెల్లిగా మొదలవుతున్నాయి. పరుగులు మెల్లిగా ప్రారంభం కాబోతున్నాయి. సినిమా...
24-05-2020
May 24, 2020, 04:58 IST
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకురానున్న 10 రోజుల్లో 2,600 శ్రామిక్‌...
24-05-2020
May 24, 2020, 04:52 IST
న్యూఢిల్లీ: దేశంలో లాక్‌డౌన్‌ నిబంధనల నుంచి మినహాయింపులు ఇచ్చిన తర్వాత కరోనా మహమ్మారి జడలు విప్పుతోంది. వరుసగా రెండో రోజు...
24-05-2020
May 24, 2020, 04:33 IST
న్యూఢిల్లీ:   ఇండియాలో ఆగస్టు లేదా సెప్టెంబర్‌ కంటే ముందే అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలను పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పౌర విమానయాన...
24-05-2020
May 24, 2020, 04:22 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో మరో 47 మంది కోలుకున్నారు. దీంతో కరోనా వైరస్‌...
24-05-2020
May 24, 2020, 04:16 IST
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది....
24-05-2020
May 24, 2020, 03:17 IST
వైద్య సిబ్బంది కొరత లేకుండా చూసుకోవాలి. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న ఖాళీలను గుర్తించి రిక్రూట్‌మెంట్‌ను వేగంగా చేయాలి. ఎన్ని ఖాళీలుంటే.....
24-05-2020
May 24, 2020, 00:08 IST
‘‘రామ్‌’ ప్రయాణం ఆగిపోలేదని, తాత్కాలిక బ్రేక్‌ మాత్రమే పడింది’’ అంటున్నారు దర్శకుడు జీతూ జోసెఫ్‌. మోహన్‌లాల్, త్రిష జంటగా జీతూ...
23-05-2020
May 23, 2020, 22:11 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 52 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటెన్‌లో ప్రకటించింది....
23-05-2020
May 23, 2020, 20:59 IST
వాష్టింగ్టన్: కరోనా మహమ్మారి సంక్షోభం కాలంలో అమెరికా అతలాకుతలమవుతోంది. ఆర్థికవ్యవస్థ మరింత మందగమనంలోకి కూరుకుపోతోందని స్వయంగా ఫెడ్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే  ఈ...
23-05-2020
May 23, 2020, 20:30 IST
సాక్షి, న్యూఢిల్లీ:  కరోనా మహమ్మారికి ఢిల్లీలోని మరో సీనియర్ వైద్యులు బలయ్యారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్...
23-05-2020
May 23, 2020, 17:02 IST
లండన్‌ : ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో గుండెపోటు, ఊపిరితిత్తులు, మధుమేహం జబ్బులతో బాధపడుతున్న వారితోపాటు స్థూలకాయులు...
23-05-2020
May 23, 2020, 16:50 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో ప్రముఖ గ్లోబల్ టెక్ కంపెనీ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (ఐబీఎం) ఉద్యోగాల కోతకు...
23-05-2020
May 23, 2020, 16:35 IST
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని వైద్య శాఖ ఖాళీలను భర్తీ చేయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని, త్వరలో 9700కి పైగా డాక్టర్లు,...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top