జంతువులకూ కరోనా పరీక్షలు

Coronavirus: Central Govt has identified that Covid-19 Effect Also To Animals - Sakshi

దేశంలో నాలుగు సంస్థల ఎంపిక

సాక్షి, అమరావతి: దేశంలో పెంపుడు జంతువులు, వన్యప్రాణులకు సైతం కరోనా వైరస్‌ (కోవిడ్‌– 19) ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.  అందువల్ల వీటికి కూడా  కోవిడ్‌ –19 పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే దేశ వ్యాప్తంగా శాంపిల్స్‌ పరీక్షల కోసం నాలుగు సంస్థలను ఎంపిక చేసింది. ఈ మేరకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ (ఐసీఏఆర్‌) జంతువైద్య విభాగం ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ జ్యోతి మిశ్రీ ఆయా సంస్థలకు, రాష్ట్రాల పశువైద్యశాఖలకు ఆదేశాలు జారీచేశారు. శాంపిల్స్‌ సేకరణ, పరీక్షల సమయంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి (ఐసీఎంఆర్‌ ) నిబంధనావళిని పక్కా గా పాటించాలని పేర్కొన్నారు.

ఎంపికచేసిన సంస్థలివే..
► నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజెస్‌ (ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ) –  భోపాల్‌ (మధ్య ప్రదేశ్‌)
► నేషనల్‌ రీసెర్చి సెంటర్‌ ఆన్‌ ఈక్విన్స్‌ (ఎన్‌ఆర్సీఈ) – హిసార్‌ (హరియాణా)
► సెంటర్‌ ఫర్‌ యానిమల్‌ డిసీజ్‌ రీసెర్చ్‌ అండ్‌ డయాగ్నస్టిక్‌ (సీఏడీఆర్‌ఏడీ)  
►  ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చి ఇన్‌ స్టిట్యూట్‌ (ఐవీఆర్‌ఐ)              
– ఇజాత్‌ నగర్, బరేలి, ఉత్తర ప్రదేశ్‌           

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top