కరోనా పరీక్షలు చేయించుకున్న మంత్రి, ఎంపీ | Corona tests for Botsa satyanarayana and chandrashekar | Sakshi
Sakshi News home page

కరోనా పరీక్షలు చేయించుకున్న మంత్రి, ఎంపీ

Apr 27 2020 5:55 PM | Updated on Apr 27 2020 6:43 PM

Corona tests for Botsa satyanarayana and chandrashekar - Sakshi

సాక్షి, విజయనగరం : కరోనా నిర్ధారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తుంది. మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలకు విజయనగరంలోని వారి నివాసంలోనే వైద్యులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అలాగే పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్‌కి కూడా పరీక్షలు నిర్వహించారు. ముగ్గురికి కరోనా నెగటివ్‌గా వైద్యులు నిర్ధారించారు.

మరోవైపు కరోనా నియంత్రణపై టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశమైంది. కరోనా నివారణకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషిచేస్తున్నారని బొత్స అన్నారు. ఇదే వ్యూహాన్ని కొనసాగించి జిల్లాను కరోనా రహితంగా నిలపాలని కోరారు. డయాలసిస్, క్యాన్సర్‌ రోగులు ఆస్పత్రులకు వెళ్లేందుకు.. ఎలాంటి  ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పాలు, కూరగాయలు విక్రయించే వారికి సహకరించాలని మంత్రి బొత్స విజ్ఞప్తి చేశారు. 

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement