Corona Cases in Andhra Pradesh, District Wise List: 60 New Positive Cases Are Registered in AP - Sakshi Telugu
Sakshi News home page

ఏపీలో కొత్తగా 60 కరోనా కేసులు..

May 6 2020 11:25 AM | Updated on May 6 2020 6:39 PM

Corona Cases Rises To 1777 In Andhra Pradesh - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 60 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,777కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 7,782 శాంపిల్స్‌ పరీక్షించగా.. 60 మందికి కరోనా నిర్దారణ అయినట్టు తెలిపింది. వీరిలో తూర్పు గోదావరి జిల్లాలో 1, గుంటూరు జిల్లాలో 12, వైఎస్సార్‌ జిల్లాలో 1, కృష్ణా జిల్లాలో 14, కర్నూలు జిల్లాలో 17, విశాఖపట్నం జిల్లాలో 2 కేసులతోపాటుగా కర్ణాటకకి చెందినవి 1, గుజరాత్‌కు చెందినవి 12 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సమయంలో మిగతా 7 జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.(చదవండి : రాష్ట్రంలో రికవరీ రేటు పెరుగుదల)

గడిచిన 24 గంటల్లో 140 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 729కి చేరింది. ఇప్పటివరకు 36 మంది కరోనాతో మృతిచెందారు. ప్రస్తుతం 1012 మంది కరోనాతో రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఏపీలో ఇప్పటివరకు 1,42,274 కరోనా టెస్టులు నిర్వహించారు. (చదవండి : కరోనా షాక్‌ 4,700 కోట్లు!)

జిల్లాల వారీగా కరోనా కేసులు..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement