14 ద్విచక్రవాహనాలు స్వాధీనం: నలుగురు అరెస్ట్ | cops arrested 4, recovered14 bikes | Sakshi
Sakshi News home page

14 ద్విచక్రవాహనాలు స్వాధీనం: నలుగురు అరెస్ట్

Jun 3 2015 7:09 PM | Updated on Sep 3 2017 3:10 AM

గూడూరు పోలీసులు నలుగురు బైక్ దొంగలను అరెస్ట్‌చేసి వారి నుంచి 14 మోటార్ బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.

నెల్లూరు: గూడూరు పోలీసులు నలుగురు బైక్ దొంగలను అరెస్ట్‌చేసి వారి నుంచి 14 మోటార్ బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి కొర్లగుంటకు చెందిన గుంజి ప్రకాశ్, కోటయ్య, చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంకు చెందిన మునికన్నయ్య, గూడూరుకు చెందిన శ్రీనివాస కుమార్ ముఠాగా ఏర్పడి బైక్ దొంగతనాలు చేసేవారు. ముందుగా అందిన సమాచారం ప్రకారం గూడూరు పోలీసులు బుధవారం గూడూరులోని ఒక ఇంటిపై దాడిచేసి నలుగురు దొంగలను అరెస్ట్ చేయడంతో పాటు ఇంటిలో దాచిన 14 మోటార్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగలు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో బైక్ దొంగతనాలకు పాల్పడేవారని పోలీసులు చెప్పారు. వీరిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement