విడిపోతే కూలీ బతుకులే : భూమన కరుణాకరరెడ్డి | Cooley lived up: bhumana karunakara Reddy | Sakshi
Sakshi News home page

విడిపోతే కూలీ బతుకులే : భూమన కరుణాకరరెడ్డి

Sep 29 2013 3:37 AM | Updated on Aug 8 2018 5:41 PM

రాష్ట్ర విభజన జరిగితే విద్యావంతులంతా కూలీ పనులు చేసుకోవాల్సిందేనని తిరుపతి ఎమ్మెల్యే భూ మన కరుణాకరరెడ్డి అన్నారు. శనివారం ఆయన తిరుపతి రైల్వే స్టేషనులో రైల్వే కూలీగా లగేజీ మోస్తూ నిరసన తెలియజేశారు.

సాక్షి, తిరుపతి : రాష్ట్ర విభజన జరిగితే విద్యావంతులంతా కూలీ పనులు చేసుకోవాల్సిందేనని తిరుపతి ఎమ్మెల్యే భూ మన కరుణాకరరెడ్డి అన్నారు. శనివారం ఆయన తిరుపతి రైల్వే స్టేషనులో రైల్వే కూలీగా లగేజీ మోస్తూ నిరసన తెలియజేశారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ  విభజన జరిగితే తాగు, సాగు నీరు లేక సీమాంధ్ర ప్రజల నానా అవస్థలకు గురికావాల్సి ఉంటుందని తెలిపారు. చదువుకున్న విద్యార్థు లు కూలీలుగా బతకాల్సిన పరిస్థితి దాపురిస్తుందని ఆ వేదన వ్యక్తం చేశారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా మరింత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విభజనకు వ్యతిరేకమని చెప్పిన ప్రకటనలో నిజాయితీ కనిపించలేదని అన్నా రు.  తెలుగు దేశం, కాంగ్రెసు పార్టీలకు ఏమి చేయాలో దిక్కుతోచకుండా వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీపై విమర్శలు చేస్తున్నాయని చెప్పారు. నీచమైన ఆరోపణలు చేయడానికి కూడా వెనకాడడం లేదని అన్నారు. అన్ని పార్టీలు ప్రకటనలు చేయడం తప్ప సమైక్యంధ్ర కోసం ఉద్యమించడం లేదని ఆరోపించారు.

వైఎస్‌ఆర్‌సీపీ ఒక్కటే విభజన ప్రకటనను వ్యతిరేకించి సమైక్య ఉద్యమం చేస్తోందని తెలిపారు. పార్టీ నాయకుడు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి వరప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే కలిగే నష్టాలను ప్రజలుకు వివరిస్తూ, ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తున్న ఏకైక నాయకుడు భూమన కరుణాకరరెడ్డి మాత్రమేనని తెలిపారు.  వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఉద్యమం ఉధృత రూపం దాల్చనుందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మహిళా కన్వీనర్ కుసుమ, నాయకులు రాజేంద్ర, ఎస్‌కె.బాబు, తొండమనాటి వెంకటేష్, కేతం రామారావు, చెంచయ్య యాదవ్, గీత, పునీత తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement