అత్తింటి వేధింపులతో కానిస్టేబుల్‌ భార్య ఆత్మహత్య | constable wife commits suicide in srikakulam district | Sakshi
Sakshi News home page

అత్తింటి వేధింపులతో కానిస్టేబుల్‌ భార్య ఆత్మహత్య

Dec 5 2017 12:30 PM | Updated on Mar 19 2019 5:52 PM

constable wife commits suicide in srikakulam district - Sakshi

శ్రీకాకుళం జిల్లా / పద్మనాభం(భీమిలి): అత్తింటి వేధింపులు తాళలేక కానిస్టేబుల్‌ భార్య ఉరిపోసుకుని అత్మహత్య పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని ఐనాడ పంచాయతీ సత్యనారాయణపురంలో సోమవారం చోటుచేసుకుంది. పద్మనాభం ఎస్‌ఐ ఎస్‌.రామమూర్తి అందించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కొండంపేట గ్రామానికి చెందిన కెల్ల అన్నాజీరావు కుమార్తె శిరీషాతో చింతవలస ఐదో బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చింతలూరి శ్రీనివాసరావుకు వివాహమైంది. వివాహమై నాలుగేళ్లు కావస్తుంది. 

వీరు సత్యనారాయణపురంలో సొంత ఇళ్లు కట్టుకుని నివాసముంటున్నారు. ఇంట్లో పనిచేయడంలేదని శిరీషాను అత్త రోజూ వేధిస్తుంది. మామ తాగి వచ్చి భోజనం పెట్టలేడందని దుర్పాషలాడుతున్నాడు. భర్త శ్రీనివాసరావు శారీరకంగా,మానసికంగా వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపం చెందిన శిరీషా ఇంట్లో ఫ్యాన్‌ హుక్‌కు ఉరి పోసుకుని మృతి చెందింది. మృతురాలి తండ్రి కెల్ల అన్నాజీరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్త, మామ, భర్త శ్రీనివాసరావులపై 306, 498ఎ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. శిరీషా మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం భీమునిపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement