విజయ ఢంకా మోగిస్తాం | congress leaders may help in telangana region | Sakshi
Sakshi News home page

విజయ ఢంకా మోగిస్తాం

Mar 9 2014 10:45 PM | Updated on Mar 18 2019 9:02 PM

రానున్న కాలంలో రాజకీయాల్లో పెనుమార్పులోస్తాయని, మున్సిపల్, స్థానిక ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయ ఢంకా మోగిస్తుందని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు.

 వికారాబాద్, న్యూస్‌లైన్:
 రానున్న కాలంలో రాజకీయాల్లో పెనుమార్పులోస్తాయని, మున్సిపల్, స్థానిక ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయ ఢంకా మోగిస్తుందని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు.  ఆదివారం ఇక్కడ జిల్లా గ్ర ంథాలయ శాఖ మాజీ చైర్మన్ గుడిసే లక్ష్మణ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాలనూ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంద ని ఆశాభావం వ్యక్తంచేశారు. వికారాబాద్,తాండూరు మున్సిపాలిటీల్లో ఇప్పటికే పలు వార్డులు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయన్నారు. పార్టీ తరపున బరిలో దిగే అభ్యర్థులను రెండు మూడు రోజుల్లో ఖరారు చేస్తామన్నారు. ఇప్పటికే కమిటీలను వేశామని సాధ్యమైనంత వరకు ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న అభ్యర్థులనే బరిలో దించుతామని పేర్కొన్నారు. టికె ట్ల ఖరారులో సీనియర్, జూనియర్ అనే తారతమ్యాలు లేవని, పార్టీకి సేవ చేసిన పరిస్థితులను, ప్రజల ఆదరణ ఉన్నవారికే టికెట్లు కేటాయిస్తామని ప్రసాద్‌కుమార్ స్పష్టంచేశారు. ఛైర్మన్ అభ్యర్థులను ఇప్పుడే పార్టీ తరపున నిర్ణయించలేమని ఆయన పేర్కొన్నారు.
 
 వికారాబాద్ మున్సిపల్‌లోని 28 వార్డులనూ హస్తగతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అన్ని సీట్లు గెలిచిన తర్వాత ప్రజాభీష్టం మేరకే ఛైర్మన్‌ను ఎంపిక చేస్తామన్నారు. టికెట్లు దక్కని వారు పార్టీని వీడిపోవాల్సిన అవసరం లేద న్నారు. వారికి భవిష్యత్‌లో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. అవినీతిలో కూరుకుపోయిన వారికి టికెట్లు ఇచ్చేదిలేదన్నారు. టీడీపీకి ఓటు వేస్తే అది మురిగిపోయినట్లేనన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దుతామని గతంలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్‌కుమార్‌ను  గుడిసే లక్ష్మణ్ సన్మానించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు లంకల లక్ష్మీకాంత్‌రెడ్డి, శంకరయ్య, సత్యనారాయణ, నర్సిములు, బిచ్చిబాబుగౌడ్, శ్రీనివాస్, బుచ్చన్న, పటేల్ సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement