రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ నేతలు ప్రాంతాలవారీగా ప్రజాభీష్టం మేరకు వ్యవహరిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు.
హైదరాబాద్ : రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ నేతలు ప్రాంతాలవారీగా ప్రజాభీష్టం మేరకు వ్యవహరిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. అసెంబ్లీకి వచ్చే తెలంగాణ బిల్లుపై కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా వ్యవహరిస్తారని ఆయన బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. దీనిపై పార్టీ విప్ జారీ చేయదని బొత్స తెలిపారు. తుపాన్ నష్టపరిహారం కోసమే నిన్న కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేని ఢిల్లీలో కలిసినట్లు ఆయన తెలిపారు.