విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు వద్ద ముంపునకు గురైన రహదారిని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సోమవారం పరిశీలించారు.
ముంపు ప్రాంతాల్లో కలెక‍్టర్ పరిశీలన
Jul 17 2017 12:36 PM | Updated on Sep 5 2017 4:15 PM
కొమరాడ: విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు వద్ద ముంపునకు గురైన రహదారిని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సోమవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర‍్బంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ పొరుగు రాష్ట్రమైన ఒడిశాలో వరద తాకిడి ఎక్కువ కావడంవల‍్ల విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజిన్‌లో గల కొమరాడ , గరుగుబిల్లి, జియ్యమ్మవలస మండలాలలో నాగావళి నది ప్రాంతాలకు చెందిన ఈ మూడు మండలాలు ముంపునకు గురైయ్యాయని చెప్పారు. తోటపల్లి వంతెన వద్ద ప్రస్తుతం నీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతోందని, పలు గ్రామాలలో నీటి ప్రవాహం తగ్గి రాకపోకలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన రహదారులను బాగుచేస్తాం అని ఆయన తెలిపారు.
Advertisement


