జ్యోతిరావు పూలేకి సీఎం వైఎస్ జగన్ నివాళి | CM YS Jagan Tribute To Mahatma Jyotirao Phule | Sakshi
Sakshi News home page

పూలే కృషి చిరస్మరణీయం: సీఎం వైఎస్‌ జగన్‌

Apr 11 2020 11:07 AM | Updated on Apr 11 2020 2:40 PM

CM YS Jagan Tribute To Mahatma Jyotirao Phule - Sakshi

సాక్షి, అమరావతి: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రులు మోపిదేవి, వెల్లంపల్లి.. ఎమ్మెల్యే జోగి రమేష్‌, వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం హాజరయ్యారు. అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. 'దేశసమాజ పునర్నిర్మాణానికి జ్యోతిరావు పూలే చేసిన విశేష కృషి చిరస్మరణీయం. వెనుకబడిన తరగతుల సంక్షేమం, అందరికీ చదువులు, మహిళా సాధికారత వంటి ఆ మహనీయుని ఆశయాలే స్ఫూర్తిగా మన ప్రభుత్వం ముందుకెళ్తోందని' పేర్కొన్నారు. చదవండి: మీ నిస్వార్థ సేవలకు సెల్యూట్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement