రూ.4 వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్ బలోపేతం | CM YS Jagan Review Meeting On Cold Storages And Godowns Construction | Sakshi
Sakshi News home page

కోల్డ్‌ స్టోరేజీ, గోడౌన్ల నిర్మాణంపై సీఎం జగన్‌ సమీక్ష

Jul 23 2020 2:23 PM | Updated on Jul 23 2020 2:56 PM

CM YS Jagan Review Meeting On Cold Storages And Godowns Construction - Sakshi

సాక్షి, తాడేపల్లి: రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని.. రూ. 4 వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్‌ను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రతీ మండలానికి ఒక కోల్డ్ స్టోరేజీ నిర్మిస్తామని పేర్కొన్నారు. వ్యవసాయ గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణంపై ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (పేదలకు ఇళ్ల స్థలాలు రెడీ )

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రైతు తన పంటను అమ్ముకునేలా మార్కెటింగ్‌ శాఖ తోడ్పాటు అందించాలని.. కనీస గిట్టుబాటు ధర రాని పక్షంలో ధరల స్థిరీకరణ నిధితో ఆదుకోవాలని సూచించారు. ‘‘ప్రతి రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే) పరిధిలో గోదాంలు, గ్రేడింగ్‌, సార్టింగ్ యంత్ర పరికరాలు ఉంటాయి. తన వద్ద పలానా పంట ఉందని రైతు ఆర్బీకేకు సమాచారం ఇస్తాడు..ఆ సమాచారం ఆధారంగా నేరుగా సెంట్రల్ సర్వర్‌కు చేరాలి. సెప్టెంబర్ నెలకల్లా ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ రూపొందించాలి’’ అని అధికారులను ఆదేశించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement