వైఎస్‌ జగన్‌: సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా | YS Jagan's Delhi Tour Got Postponed - Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన వాయిదా

Jun 2 2020 11:02 AM | Updated on Jun 2 2020 5:20 PM

CM Ys Jagan cuts short Delhi visit - Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైన నేపథ్యంలో ఆయా అంశాలను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో, పోలవరం నిధుల గురించి కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో చర్చించాలని సీఎం వైఎస్‌ జగన్‌ భావించారు. షెడ్యుల్‌ ప్రకారం తాడేపల్లి నుంచి మంగళవారం ఉదయం 10 గంటలకు సీఎం బయలుదేరి వెళ్లాల్సి ఉండగా, ఈ పర్యటన వాయిదా పడింది. వలస కూలీల తరలింపుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనుకున్నారు. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ పెను తుపాను కారణంగా.. అత్యవసర చర్యలపై వరుస సమావేశాలతో బిజీ ఉన్నందున వాయిదా వేసుకోమని హోంశాఖ కోరిన నేపథ్యంలో సీఎం పర్యటన వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement