సీఎంను బర్తరఫ్ చేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని బీజేపీ నేత, ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్ చే శారు.
అచ్చంపేట, న్యూస్‌లైన్: సీఎంను బర్తరఫ్ చేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని బీజేపీ నేత, ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్ చే శారు. తెలంగాణ విషయంలో కిరికిరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీడబ్ల్యూసీ, సోనియాగాంధీ, ప్రధానమంత్రి నిర్ణయాలను ధిక్కరించి మాట్లాడుతున్నా ఆయనను ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నిస్తున్నారు. మం గళవారం నాగం అచ్చంపేట ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడుతూ.. దేశ యువత, అందరిచూపు నేడు బీజేపీ అగ్రనేత, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ వైపు ఉందన్నారు. పాట్నాలో మోడీ సభలో జరిగిన బాంబుల దాడికి బెదరకుండా ప్రజలు సభను విజయవం తం చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని, ఏ పార్టీలతో పొత్తు లేకుండా పోటీచేస్తుందన్నారు. జీఓఎంకు రెండు ప్రాంతాల బీజేపీ ఒక్కటే నిర్ణయం ప్రకటిస్తుందని, మిగత పార్టీల మాదిరిగా ద్వంద్వ వైఖరి అవలంభించదన్నారు. ప్రజావిశ్వాసం కోల్పోయిన ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మండికారి బాలాజీ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గౌరీశంకర్, ఏబీవీపీ నాయకులు శ్రీనునాయక్ పాల్గొన్నారు.