బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా సీఎం చంద్రబాబు
బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా సీఎం చంద్రబాబు మొండి వైఖరి ఏజెన్సీలో టీడీపీ నేతలను రాజీనామా బాట పట్టించింది. గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా నడుచుకోవడాన్ని జీర్ణించుకోలేని నాయకులు పార్టీని వీడాలని నిర్ణయించుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.
మాజీ మంత్రి మణికుమారి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ వంజంగి కాంతమ్మలతోపాటు ఏజెన్సీకి చెందిన ముఖ్యనేతలు భేటీ అయ్యారు. పార్టీ నేతలు ముగ్గురిని మావోయిస్టులు కిడ్నాప్ చేసి డెడ్‌లైన్ విధించినా సీఎం స్పందించకపోవడంపై విరుచుకుపడ్డారు. పార్టీలో కొనసాగలేమని వారి ఎదుటే పలువురు తేల్చిచెప్పారు.