నేటి నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలు | civils main examinations from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలు

Dec 2 2013 8:50 AM | Updated on Sep 2 2017 1:11 AM

ఐఏఎస్, ఐపీఎస్, ఇతర సర్వీసులకు ఎంపికయ్యేందకు గాను యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు సోమవారం నుంచి ఈనెల 8వ తేదీ వరకు జరగనున్నాయి.

ఐఏఎస్, ఐపీఎస్, ఇతర సర్వీసులకు ఎంపికయ్యేందకు గాను యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు సోమవారం నుంచి ఈనెల 8వ తేదీ వరకు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా కొన్ని ప్రధాన కేంద్రాల్లో మాత్రమే జరిగే ఈ పరీక్షలు హైదరాబాద్ నగరంలోని రెండు కేంద్రాల్లో కూడా ఉంటాయి.


మల్లేపల్లిలోని అన్వర్ ఉల్ ఉలూమ్ కళాశాలతోపాటు.. సికింద్రాబాద్ ప్రాంతంలోని పీజీ కళాశాలలో కూడా ఈ పరీక్ష కేంద్రాలు ఉంటాయి. ప్రిలిమ్స్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వీటిలోనూ ఉత్తీర్ణత సాధిస్తే ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement