పోలీస్ శాఖ నాల్గో జోన్ పరిధిలో సీఐల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఉన్నతాధికారులు సీఐల బదిలీలపై కసరత్తు పూర్తి చేశారు.
కడప అర్బన్, న్యూస్‌లైన్: పోలీస్ శాఖ నాల్గో జోన్ పరిధిలో సీఐల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఉన్నతాధికారులు సీఐల బదిలీలపై కసరత్తు పూర్తి చేశారు.
కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పని చేస్తున్న సీఐల సీనియారిటీ జాబితా, వారి పని తీరు ఆధారంగా రాయలసీమ ఐజీ రాజీవ్ రతన్ బదిలీల ప్రక్రియ చేపట్టారు. డిసెంబర్ ఆఖరు నాటికి మూడేళ్లు ఒకే సర్కిల్‌లో పని చేసిన వారిని మరో ప్రాంతానికి బదిలీ చేయాలన్న నిబంధన మేరకు ప్రక్రియ పూర్తి చేశారు.