చిత్తూరులో శ్రీనికేతన్ ప్రారంభం | Chittoor start sriniketan | Sakshi
Sakshi News home page

చిత్తూరులో శ్రీనికేతన్ ప్రారంభం

Dec 24 2013 2:55 AM | Updated on Sep 2 2017 1:53 AM

చిత్తూరులో శ్రీనికేతన్ ప్రారంభం

చిత్తూరులో శ్రీనికేతన్ ప్రారంభం

చిత్తూరులోని హైరోడ్డు (స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియాకు ఎదురుగా)లో శ్రీనికేతన్ ఉమెన్స్ షాపింగ్‌మాల్‌ను సోమవారం ప్రారంభిం చారు.

చిత్తూరు (సిటీ), న్యూస్‌లైన్:  చిత్తూరులోని హైరోడ్డు (స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియాకు ఎదురుగా)లో శ్రీనికేతన్ ఉమెన్స్ షాపింగ్‌మాల్‌ను సోమవారం ప్రారంభిం చారు. విక్రయాలను ప్రముఖ సినీనటి ప్రణీత ప్రారంభించారు. అంతకు ముందు స్థానిక ఎమ్మెల్యే సీకే బాబు జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రస్తుతం తాను జూనియర్  ఎన్టీఆర్‌తో కలిసి రభస సినిమాలో నటిస్తున్నానని ప్రణీత చెప్పారు.

షోరూమ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజుకృష్ణ మాట్లాడుతూ రాష్ర్టంలో మూడవ షాపింగ్‌మాల్‌గా మారుమూలన ఉన్న చిత్తూరులో శ్రీనికేతన్‌ను ప్రారంభించామన్నారు. తమ షాపింగ్ మాల్‌లో మహిళల కోసం రూ. 20,000 నుంచి రూ. 3 లక్షల విలువగల కంచిపట్టు చీరలు, రూ. 300 నుంచి 30,000 ధర గల బెనారస్, కాంచీపురం, ఉప్పాడ, ఫ్యాన్సీ చీరలు, 0-14 సంవత్సరాలలోపు పిల్లల కోసం రూ.500 నుంచి 10,000 విలువ గల వివిధ రకాల కిడ్స్‌వేర్‌ను విక్రయానికి ఉంచామన్నారు. యువతుల కోసం గాగ్రాస్, సల్వార్స్, డ్రస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనికేతన్ షాపింగ్‌మాల్ డెరైక్టర్లు ్రపహ్లాద, రాజు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement