శత్రువుకు కూడా ఈ కష్టం రాకూడదు: చిరంజీవి | chiranjeevi, pawan kalyan console minister narayana family | Sakshi
Sakshi News home page

శత్రువుకు కూడా ఈ కష్టం రాకూడదు: చిరంజీవి

May 10 2017 11:54 AM | Updated on Mar 23 2019 9:03 PM

శత్రువుకు కూడా ఈ కష్టం రాకూడదు: చిరంజీవి - Sakshi

శత్రువుకు కూడా ఈ కష్టం రాకూడదు: చిరంజీవి

మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌ మృతి పట్ల ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సంతాపం తెలిపారు.

హైదరాబాద్‌ : మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌ మృతి పట్ల ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి  సంతాపం తెలిపారు.  ఆ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన  ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ శత్రువులకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదన్నారు. మంత్రి నారాయణ ఎదిగివచ్చిన కొడుకును పోగొట్టుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ విషాదం నుంచి మంత్రి నారాయణ త్వరగా కోలుకోవాలని చిరంజీవి ఆకాంక్షించారు.

కాగా అంతకు ముందు  జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కూడా నారాయణ కుటుంబసభ్యుల్ని ఓదార్చారు. అపోలో ఆస్పత్రికి వెళ్లిన ఆయన ఘటనకు సంబంధించిన వివరాలను కుటుంబసభ్యుల్ని  అడిగి తెలుసుకున్నారు. నిషిత్‌ మృతిపట్ల కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. అలాగే తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, కేంద్రమంత్రి సుజనా చౌదరి, చినరాజప్ప, బోండా ఉమా, టీఆర్‌ఎస్‌ ఎంపీ డీ శ్రీనివాస్‌, హరీశ్‌రావు, పొన్నాల లక్ష్మయ్య, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు కూడా మంత్రి కుటుంబాన్ని పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement