బాలల చిత్రోత్సవం అద్భుతం

బాలల చిత్రోత్సవం అద్భుతం - Sakshi


 సాక్షి, హైదరాబాద్: వారం రోజుల పాటు రాష్ట్ర రాజధాని వేదికగా లక్షలాది విద్యార్థులు, విదేశీ అతిథులకు ఆనందాన్ని పంచిన 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని లలిత కళాతోరణంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ఆయన భార్య విమలా నరసింహన్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ, సినీ నటుడు పవన్‌కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

 

 ఉత్తమ చిత్రాలుగా ఎంపికైన వాటికి ప్రముఖుల చేతుల మీదుగా బంగారు ఏనుగులను(గోల్డెన్ ఎలిఫెంట్) ప్రదానం చేశారు. ఈనెల 14 నుంచి మొదలైన బాలల చలనచిత్రోత్సవాలు 48 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు మంచి అనుభూతులను మిగిల్చాయని ప్రముఖులు పేర్కొన్నారు. గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. భాష, సంస్కృతి, ప్రాంతాలకు అతీతంగా యువతీ, యువకులు వారి బాధలు, సంతోషాలు, ఆశలు, ఆశయాలను చిత్రాల రూపంలో పిల్లల ముందు అద్భుతంగా ఆవిష్కరించారని ప్రశంసించారు. ఇంతటితో ఆగిపోకుండా మరింత ముందుకు సాగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ ఉత్సవం సందర్భంగా లక్ష మందికిపైగా చిన్నారులు చిత్రాలను చూశారని మంత్రి డీకే అరుణ తెలిపారు.

 

  చిత్ర ప్రదర్శనలే కాకుండా పిల్లల హక్కులు, లింగ వివక్ష తదితర అంశాలపై చర్చాగోష్టులు కూడా నిర్వహించామని ఉత్సవ కమిటీ సంచాలకులు, చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రావణ్‌కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలు హైదరాబాద్‌లో నిర్వహించడం తనకు సంతోషంగా ఉందని నటుడు పవన్ కల్యాణ్ తెలిపారు. సీఎస్ మహంతి, ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎన్.శివశంకర్, మేనేజింగ్ డెరైక్టర్ దాన కిశోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కాగా, గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వీఐపీ గ్యాలరీలో కూర్చు న్న ఒక వ్యక్తి ‘జై సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకుని నినాదాలు చేశారు. పోలీసులు ఆయనను బయటకు తీసుకెళ్లడంతో గందరగోళం సద్దుమణిగింది.   

 

 బంగారు ఏనుగు, ఫలకాలు అందుకున్న చిత్రాలు

 లిటిల్ డెరైక్టర్స్ విభాగం:

 ఉత్తమ చిన్నారి దర్శకుడు: బ్రేకింగ్ ది సెలైన్స్, టమాటర్ చోర్

 రెండో ఉత్తమ చిన్నారి దర్శకుడు: ఎకోల్ మోండియెల్ వరల్డ్ స్కూల్, పూల్వతి అమ్మ

 ఉత్తమ చిన్నారి దర్శకుడు (జ్యూరీ స్పెషల్):     

 1. ది ట్రిక్, 2. అవర్ బిట్, 3. గివ్ మీ ఏ ఛాన్స్

 ఇంటర్నేషనల్ లఘు చిత్రాల విభాగంలో

 ఉత్తమ లఘు చిత్రం: చింటి, రష్యా

 రెండో ఉత్తమ లఘు చిత్రం: నూడుల్ ఫిష్,

 చిన్నారుల జ్యూరీ: తమాష్, భారత్

 ప్రత్యేక ఎంపిక: మై షూస్

 యానిమేషన్ విభాగం

 ఉత్తమ యానిమేషన్ ఫీచర్: ఎర్నెస్ట్ ఈటీ సెలస్టిన్

 రెండో ఉత్తమ యానిమేషన్ ఫీచర్: జరాఫా

 బెస్ట్ ఆర్ట్ వర్క్(జ్యూరీ బహుమతి): గోపీ గవయ్యా బాఘా భజయ్యా, భారత్

 స్పెషల్ జ్యూరీ అవార్డు: మూన్ మ్యాన్

 ఉత్తమ యానిమేషన్ ఫీచర్( చిన్నారుల జ్యూరీ): అర్జున్

 లైవ్ యాక్షన్ విభాగం

 ఉత్తమ లైవ్ యాక్షన్ ఫీచర్: కౌబాయ్, డచ్

 రెండో ఉత్తమ లైవ్ యాక్షన్ ఫీచర్: ఎ హార్స్ అన్ ద బాల్కనీ

 ఉత్తమ లైవ్ యాక్షన్ డెరైక్టర్: బతుల్ ముక్తియార్(కఫాల్ సినిమా డెరైక్టర్)

 ఉత్తమ లైవ్ యాక్షన్ స్క్రీన్‌ప్లే : నోనో ది జిగ్ జాగ్ కిడ్

 ఉత్తమ లైవ్ యాక్షన్ ఫీచర్ (చిన్నారుల జ్యూరీ): ది హార్స్ ఆన్ ది బాల్కనీ

 బెస్ట్ సినిమాటోగ్రఫీ (చిన్నారుల జ్యూరీ): విండ్ స్ట్రాం

 ఉత్తమ సందేశాత్మక చిత్రం (చిన్నారుల జ్యూరీ): మదర్ ఐ లవ్ యూ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top