అగ్నిప్రమాదంలో చిన్నారి మృత్యువాత | Child killed in fire Accident | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదంలో చిన్నారి మృత్యువాత

Mar 22 2016 1:37 PM | Updated on Sep 5 2018 9:45 PM

గుంటూరు జిల్లా కాకుమాను మండలం బీకేపాలెం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఒక చిన్నారి చనిపోగా ఆరుగురు గాయాలపాలయ్యారు.

 గుంటూరు జిల్లా కాకుమాను మండలం బీకేపాలెం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఒక చిన్నారి చనిపోగా ఆరుగురు గాయాలపాలయ్యారు. గ్రామానికి చెందిన జంగా చంద్రపాల్, రజని దంపతులకు ఏడు నెలల కుమార్తె ఉంది. మంగళవారం ఆ ఇంట్లో జరగాల్సిన ఒక కార్యక్రమానికి బంధువులు కూడా వచ్చారు.

 

సోమవారం రాత్రి అంతా ఇంట్లో నిద్రించారు. తెల్లవారు జామున షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అందులో చిక్కుకుని ఇంట్లో పడుకున్న ఏడుగురు గాయాలపాలయ్యారు. వారిని గుంటూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన చంద్రపాల్, రజని దంపతుల కుమార్తె చికిత్స పొందుతూ చనిపోయింది.

 

Advertisement
 
Advertisement
Advertisement